ఓ అత్త కోడలిని పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నారా? అప్పటికే అత్తకి పెళ్లి అయింది. భర్తతో కాపురం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మేనకోడలిపై మనసు పారేసుకుంది. ఇక ఆ మేనకోడలు కూడా అత్తతో ప్రేమలో పడింది. 3 ఏళ్ల పాటు సాగిన వారి ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. అయినప్పటికీ వినకుండా పెళ్లి చేసుకుని కొత్త జంట అయ్యారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ స్వలింగ వివాహం జరిగింది. గోపాల్‌గంజ్‌లోని కుచాయికోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామానికి చెందిన అత్త తన మేనకోడలితో ప్రేమలో పడింది. అయితే ఆ అత్తకు అప్పటికే పెళ్లి అయింది. పైగా ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం ఏంటి అని కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అభ్యంతరం చెప్పారు. అత్త కోసం ఆ కోడలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. ఇక ఆ అత్త కూడా భర్తను, కుటుంబాన్ని వదిలేసి మేనకోడలి కోసం వెళ్లిపోయింది. సముసాలోని దుర్గా భవానీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న అత్తా కోడళ్లు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల మధ్య మేనకోడలి మెడలో అత్త తాళి కట్టేసింది. ఆ తర్వాత ఏడడుగులు కలిసి అగ్ని గుండం చుట్టూ కలిసి నడిచారు. ఈ ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
Share