ఏపీలో గృహ నిర్మాణ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రీచ్‌ల నుండి సొంత అవసరాలకు ట్రాక్టర్‌ల ద్వారా కూడా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రభుత్వం ఈ మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రజలు సొంత అవసరాలకు గతంలో రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్ల బండ్లకు మాత్రమే అనుమతి ఉండేది. ఇప్పటి నుండి ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్‌లోనూ ఇసుకను తీసుకుని వెళ్లేందుకు అనుమతి నిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక అవసరాలకు మాత్రమే ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లల్లో ఇసుకను తీసుకెళ్లవచ్చని సవరణ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే ఇసుకపై సీనరేజ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Share