Current Date: 26 Nov, 2024

Surya's re-entry into Mumbai.. single-handedly lead the team to victory

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ ఎవరూ ఊహించని విధంగా కమ్‌బ్యాక్ చేసింది. ఇన్నాళ్లు గాయంతో టీమ్‌కి దూరంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు 196 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ హిట్టింగ్ దెబ్బకి 27 బంతులు మిగిలి ఉండగానే ముంబయి 7 వికెట్ల తేడాతో సునాయస విజయం అందుకుంది. ఐపీఎల్ తాజా సీజన్‌లో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్ కూడా ఇదే.

మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో ఏకంగా 52 పరుగులు చేశాడు. గ్రౌండ్ నలువైపులా బంతిని బాదేసిన సూర్య.. మిస్టర్ 360 పేరుకి సార్థకం చేసుకున్నాడు. ఎంతలా అంటే బెంగళూరు క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం సూర్య బ్యాటింగ్‌కి ముగ్ధడైపోయి.. ప్రేక్షకుల్ని చప్పట్లు కొట్టాల్సిందిగా సూచించాడు. కేవలం 15-20 నిమిషాలు మాత్రమే క్రీజులో ఉన్న సూర్య మ్యాచ్‌ను పూర్తిగా ముంబయి చేతుల్లోకి తీసుకొచ్చేశాడు.

ఐదు మ్యాచ్‌లాడిన ముంబయి టీమ్‌కి ఇది మూడో విజయంకాగా.. పాయింట్ల పట్టికలోనూ ఆ జట్టు ఏడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు బెంగళూరు టీమ్ ఆరు మ్యాచ్‌లాడి ఐదో ఓటమితో 9వ స్థానానికి పడిపోయింది