Current Date: 28 Nov, 2024

పాక్ ఓటమిపై పార్లమెంట్‌లో చర్చ.. పరువుపోయె!

టీ20 ప్రపంచకప్‌ 2024లో అమెరికా, భారత్‌ చేతిలో ఘోర ఓటమితో లీగ్‌ స్టేజ్‌‌లో పాకిస్థాన్ టీమ్ ఇంటిబాట పట్టింది. దాంతో ఆ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సొంత దేశ అభిమానులు.. మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా చాలదన్నట్లు.. బాబర్‌ సేనపై పాక్ పార్లమెంట్‌లోకూడావిమర్శలువచ్చాయి.వరల్డ్‌కప్‌లో పాక్ దారుణ ప్రదర్శనను పార్లమెంట్‌లోని సభ్యులు కూడా ప్రస్తావించారు. ఓటమికి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కోవాలని పాక్ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ను ఎద్దేవా చేశారు. బాబర్‌ ఆటతీరు అధ్వానంగా ఉందని విమర్శించారు. పాకిస్థాన్‌ పార్లమెంట్‌ వేదికగా ఎంపీ అబ్దుల్‌ ఖాద్రీ పటేల్‌ విమర్శించాడు.పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ఏమైంది? ఈ జట్టు అమెరికాతో ఓడిపోయింది.. భారత్‌ చేతిలో చిత్తు అయింది. ఇప్పుడు బాబర్‌ తన సీనియర్‌ ఆటగాడి (ఇమ్రాన్‌ ఖాన్‌) నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జట్టులోని నలుగురైదుగురు సీనియర్‌ ఆటగాళ్లను ఒకదగ్గరకు చేర్చి బహిరంగ సభ పెట్టాలి. కొన్ని కాగితాలను గాల్లో ఊపుతూ నాపై కుట్ర జరుగుతోంది అని దారుణ ప్రదర్శనను కప్పిపుచ్చేలా ప్రకటన చేయాలి. అంతే ఇక అప్పటి నుంచి అతడిని ఎవరూ ప్రశ్నించరు” అని ఎంపీ ఎద్దేవా చేశాడు.

Share