గోవాకు చెందిన 30 ఏళ్ల టింకేశ్ కౌశిక్ అనే యువకుడు రెండు కాళ్లు,ఒక చేయి లేకపోయినా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఈ ఘనత సాధించి ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ యాంప్యూటి వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ళ వయసులో కరెంట్ షాక్ వల్ల అతను కాల్లు, చేయి కోల్పోయి ప్రస్తుతం కృత్రిమ అవయాలను వాడుతున్నారు. ఈ జర్నీలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని , మనోబలంతోనే ఈ ఫీట్ సాధించానని కౌశిక్ తెలిపారు.