Current Date: 26 Nov, 2024

ప్రతి చోటా ప్రజల పాలన స్వేచ్ఛగా వీధుల్లోకి వస్తున్న జనం

జగన్ ప్రభుత్వం కుప్పకూలి పోగానే ఏపీలో ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. హమ్మయ్య రాక్షస ప్రభుత్వం పోయిందంటూ ఓట్ల లెక్కింపు రోజు మధ్యాహ్నం నుంచే జనం వీధుల్లోకి రావడం మొదలు పెట్టారు. ఐదేళ్లపాటు కష్టాలు నష్టాలు గుండెల్లో పెట్టుకుని దాచుకున్న ప్రజలు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజలు ఎంతో ఆనందం పొందారో ఇప్పటి తరం చూడలేదు గానీ అంతకన్నా ఎక్కువగా జగన్ కుకటి వేళ్ళతో నెలకూలడాన్ని మాత్రం ప్రజలు అమితంగా ఆస్వాదించారు. ప్రజా పరిపాలన వస్తుందంటూ విశాఖ ఋషికొండ ప్యాలెస్ లోకి ప్రజలు అడుగు పెట్టేశారు. ఏకంగా మిద్దె మీదకు వెళ్లి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు. వైసీపీ పాలనలో అతి రహస్యంగా ఈ ప్యాలెస్ ను నిర్మించారు. పురుగు కూడా లోనికి చొరబడకుండా ప్యాలస్ లోకి అడుగు కాపలాగా ఏర్పాటు చేశారు. చివరకు జగన్ పెట్టలేకపోయాడు కానీ జనం మాత్రం కలయ దిరిగేంత స్వేచ్ఛను పొందుతున్నారు. బీచ్ రోడ్లో వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరును తొలగించడంలోనూ సామాన్యుడు పాత్ర కనిపించింది. ఎంవీవీ ప్రాజెక్ట్కు వాస్తూ దోషంగా ఉందని వీఐపీ రోడ్డు జంక్షన్లో పోలీసుల పెట్టిన అడ్డుగోడలను కూడా ప్రజలు తొలగించారు. అంతకుమించి ఎన్టీఆర్ స్థాపించిన హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటూ జగన్ పేరు మార్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే యూనివర్సిటీ గోడమీద ఉన్న వైఎస్సార్ పేరును కాళ్ళతో తన్ని మరి తొలగించారు. ఇదంతా కేవలం ఐదేళ్ల నుంచి అనుభవిస్తున్న క్షోభకు ప్రతిస్పందనగానే భావించాలి.