Current Date: 27 Nov, 2024

భారతదేశంలో తీసిన ఫస్ట్ ఫొటో ఇది ఇందులో ఉంది ఎవరో తెలుసా

ఫోటో తీయడం ఓ పెద్ద ఆర్ట్. ఆ కళను ప్రత్యేకంగా నేర్చుకునేవారు. కెమెరా సొంతంగా కొనుక్కోవడం అంటే గతంలో ఓ పెద్ద సాహసం అనేవారు. కానీ ఇప్పుడు సెల్‌ఫోన్‌లు వచ్చి ప్రతి ఒక్కరూ ఫొటోలు తీస్తున్నారు. కానీ.. రెండు దశాబ్దాల ముందు వరకు ఫోటో తీయించుకోవడం కేవలం ధనికులకు మాత్రమే ఉన్న అవకాశంగా భావించేవారు.ఫోటోగ్రఫి చరిత్రని తరచి చూస్తే బోలెడు మైలురాళ్ళు. ప్రపంచంలో తొలిసారిగా 1826లో ఫ్రాన్స్‌లో కెమెరాతో మొదటి ఫోటో తీశారు. మరి మనదేశంలో ఫస్ట్ ఫోటో ఏదో మీకు తెలుసాఈ ఫోటోలో ఉన్నది ప్రస్తుత కేరళలోని ట్రావెన్ కోర్ సంస్థాన అధిపతి మహారాజా ఐల్యం తిర్నూల్. ఆయన భార్య కళ్యాణి కుట్టి అమ్మాల్. 1865లో తీసిన తొలి ఫోటో ఇది. అప్పట్లో ఫోటోలు రాజులు, జమీందారులు మాత్రమే తీసుకునే వారట. 1840 నుంచే మన దేశంలో ఫోటోగ్రఫీ ఉంది.ట్రావెన్ కోర్ సంస్థాన అధిపతి దంపతుల ఫోటోయే. మన దేశంలో తొలి ఫోటో అని కొందరు అంటారు. ఫోటోగ్రాఫర్ పేరు కచ్చితంగా తెలియదు. 

Share