Current Date: 05 Oct, 2024

మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం పొడిగింపు

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం అమలులో ఉంటుందని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Share