త్వరలోనే నూతన టెక్స్ టైల్ప్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్స్ పార్కుపై టీడీపీ ఎమ్మెల్యే బి. జయనాగేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత సమాధానం ఇచ్చారు. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటునకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించడం జరిగిందని, అందుకు 90 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నారు. తరవాత జగన్ సర్కార్దాన్నిపట్టించుకోలేదన్నారు. అంతే కాకుండా పేదల ఇళ్ల పేరుతో ఎమ్మిగనూరు టెక్స్‌టైల్స్ పార్కులో 14 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించిందన్నారు.