లంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు సడన్‌గా తెరపైకి వచ్చాయి. వీరి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. అలానే ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంతతో నాగచైతన్యతో విడాకులు తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని కూడా వాళ్లు చెప్తున్నారు.
హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రచ్చరేగడంతో.. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను
హీరోయిన్లను బెదిరించాననే మాట కూడా అవాస్తమని కేటీఆర్ స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు చేసేవారిని తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని.. చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా, సీఎం అయినా తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఫోన్లని ట్యాప్ చేసి హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం తనకు ఏముందని ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన తనకి లేదని చెప్పుకొచ్చారు. గతంలో కూడా కేటీఆర్, రకుల్‌ప్రీత్ సింగ్ మధ్య బంధం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.