Current Date: 05 Oct, 2024

సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది రామోజీరావే... జూనియర్ ఎన్టీఆర్...

రామోజీ రావు ఇక లేరనే వార్త చాల చాల బాధాకరమని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. శ్రీ రామోజీ రావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒక్కరు.ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. నిన్ను చూడాలని చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను.ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.