కరోనా కష్టకాలంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా పేదలకు, వలస కార్మకులకు అండగా నిలిచారు నటుడు సోనూసూద్. లాక్‌డౌన్ మొత్తం ఆయన సేవలకే అంకితమయ్యారు. మరోసారి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బనవనూరుకు చెందిన దేవికుమారీ అమ్మాయి చదువుకు కావాల్సిన సాయం అందేశారు. ఆమె ఈ విషయాన్ని తెలియజేస్తూ మా కుటుంబం ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ, నాకు చదువుపై ఎంతో ఆసక్తి ఉంది. ఇంట్లో ఉన్న పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులు నా చదువును మధ్యలోనే నిలిపివేయాలనుకున్నారు. నా కలలన్నీ ఆవిరయ్యాయని బాధ పడ్డాను. అలాంటి సమయంలో సోనూసూద్ సర్ నాకు అండగా నిలిచారు. నా చదువుకు కావాల్సిన సాయం చేశారు. ఆయన నాకు దేవుడితో సమానం’’ అని దేవి ఆనందం వ్యక్తం చేసింది. సోనూసూద్ ఫొటోకు పాలాభిషేకం చేసింది.