Current Date: 27 Nov, 2024

ఏపీలో నాసిరకం మద్యంతో ఆరోగ్యం ఛిద్రం!

వైసీపీ హయాంలో మద్యం బాధిత అనారోగ్య సమస్యల ఉపద్రవం రాష్ట్రాన్ని ముంచెత్తింది. నాణ్యత లేని మద్యం తాగి కాలేయం, క్లోమగ్రంధి (పాంక్రియాస్‌) దెబ్బతిని ఆసుపత్రుల పాలైన వారి సంఖ్య.. 2014-19తో పోలిస్తే 2019-24లో రెట్టింపైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. వీరిలో పలువురి ఆరోగ్యం వేగంగా క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణంగా.. తరచూ మద్యం తాగే అలవాటున్నా సరే కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10-15 ఏళ్లు పడుతుంది. కానీ ఏపీలో ఓ మాదిరిగా తాగే అలవాటున్నవారికీ నాలుగేళ్లలోనే కాలేయం పాడైపోతోంది. నాసిరకం మద్యం వల్లే ఇంత త్వరగా కాలేయం పాడైపోతోందని బాధితులు, వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎన్సీఆర్‌బీ రికార్డ్స్ ప్రకారం మద్యానికి బానిస అయ్యి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు గత ఐదేళ్లలో 100% పెరిగారు. మద్యం సేవించి విచక్షణ కోల్పోయి చేసిన దాడులు 76% రాష్ట్రంలో పెరిగాయి. అలాగే కిడ్నీ, లివర్ ఫెయిల్ అయి చనిపోయిన వాళ్ళు కూడా ఐదేళ్లలో 55% వరకు పెరిగారు. ఎంతలా అంటే.. మద్యం వల్ల ఆరోగ్యం దెబ్బతిని ఒక్క గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ సంఖ్య 1300% పెరగడం గమనార్హం.

Share