తుంగభద్ర బోర్డు సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తుంగభద్ర డ్యామ్‌కు 33 గేట్లు ఒకేసారి మార్చాలని నిర్ణయించింది. క్రస్ట్ గేట్లపై డీపీఆర్ సిద్ధం చేయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. తుంగభద్ర అకౌంట్స్ ఫ్రీజ్ తొలగించాలని కోరింది. తుంగభద్రలో పూడిక కారణంగా కర్ణాటక ప్రతిపాదిస్తున్న నవళి జలాశయం నిర్మాణ ప్రతిపాదన సహాతుకమైనది కాదని తెలిపింది. కేసీ కెనాల్‌కు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కృష్ణా నీటి మళ్లింపు ట్రైబ్యునల్‌కు విరుద్ధంగా ఉందని చెప్పింది. కాగా కర్ణాటక, ఏపీ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది.
Share