Current Date: 06 Oct, 2024

పులి మీద సవారి చేస్తున్నావ్ రేవంత్ రెడ్డి జాగ్రత్త నారాయణ హితవు

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల అంశం ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెరువులు, కుంటలు, పార్క్‌లకు సంబంధించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన భవనాలు, నిర్మాణాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అధికారులు వరుసగా కూల్చేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను భారీ యంత్రాలు ఉపయోగించి హైడ్రా అధికారులు కూల్చివేయడం తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హైడ్రా కూల్చివేతల అంశాన్ని స్వాగతించిన నారాయణ ఈ కూల్చివేతల కారణంగా బడా బాబులు కూడా జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో బడా బాబుల ఒత్తిడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా  జైలుకు వెళ్లాల్సి వచ్చే ప్రమాదం కూడా ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారని మధ్యలో ఆపేస్తే అదే పులి తినేస్తుందని హెచ్చరించారు. ఇక ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నాగార్జున.. చెరువు బఫర్ జోన్‌లో కాకుండా ఏకంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే నిర్మించారని ఆరోపించారు.

Share