ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ ఆదివారం వెల్లడిరచింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, ఆయన భార్య అనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కల్యాణ్‌కు ఇంటర్వ్యూ చేశారు. రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించాయి. దీంతో పవన్ ఏం మాట్లాడిరదీ అర్థం కాలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడిరచారని అందులో పేర్కొన్నారు.