సోషల్ మీడియా రాకతో ప్రపంచమే ఒక కుగ్రామం గా మారిన ప్రస్తుత తరుణంలో ఎక్కడ ఏ చిన్నా తప్పు జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అదే సినిమాలకు సంభందించిన అంశం అయితే విపరీతంగా ట్రోలింగ్స్ కు గురవటం ఖాయం. ప్రస్తు తం ఒక సినిమా లోని సీన్ వేరే సినిమా లోని సీన్తో కాస్త పోలిక ఉన్నా చాలు అది కాపీ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ , ట్రోల్స్ వచ్చేస్తున్నాయి. సీన్ మాత్రమే కాదు. పాటలు కూడా అంతే. ముఖ్యంగా సంగీతంలో లోపాలను వెతికి, ఆయా మ్యూజిక్ డైరెక్టర్స్ పై కంటెంట్ క్రియేటర్స్ మీమ్స్ క్రియేట్ చేస్తారు. కట్ చేస్తే తాజాగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పై కూడా అలాంటి ట్రోల్సే వస్తున్నా యి. టాలీ వుడ్ దర్శకులు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కంబినేషన్లో 'దేవర' సినిమాకు అనిరుథ్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి "ఫియర్' సాంగ్ విడుదలై మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తాజాగా యూత్ కోసం రెండో పాటను విడు దల చేశారు. ఎన్టీఆర్, జాన్వీకపూర్ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ఇది. 'చుట్టుమల్లే' పాట విడుదల అవ్వగానే మ్యూజిక్ లవర్స్ విపరీతంగా ఎంజా య్ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్, లైక్స్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం ఈ పాటను ఎక్కడో విన్నట్టు ఉందే అంటూ వేరే పాటతో పోలుస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
Share