Current Date: 27 Nov, 2024

మొహం చెల్లని జగన్

అసెంబ్లీ లో కూర్చోడానికి మాజీ సీఎం జగన్ మొహం చెల్లడం లేదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని దీన స్థితిలో శుక్రవారం జగన్ సాధారణ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీ కి వచ్చారు. కానీ అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం తన రూమ్ కి వెళ్లిపోయారు. 2019 లో మాటి మాటికీ టీడీపీ నుంచి కేవలం 23 మంది సభ్యులే ఎన్నికయ్యారని జగన్ ఏద్దేవా చేసేవారు. చంద్రబాబు ను సయితం నిండు సభలో అవమానించి పిచ్చిగా జగన్ ఆనందపడేవారు... కానీ 2024 లో జగన్ జాతకం పూర్తిగా తిరగబడింది. వైసీపీ నుంచి కేవలం 11 మందే గెలుపొందారు.. దీన్ని జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేక నా నా అవస్థలూ పడుతున్నారు. ఇప్పటికీ జగన్ లో మార్పు రాకపోవడం తో సొంత పార్టీ వాళ్ళే జగన్ దగ్గరకు వెళ్ళడానికి వెనుకాడు తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లో సీఎం గా బంపర్ మెజారిటీ తో ఎన్నికయిన చంద్రబాబు ను అభినందించే సంస్కారన్ని కూడా జగన్ కోల్పోయారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా చంద్రబాబు ప్రభుత్వానికి సహకరిస్తాం అని కూడా జగన్ ప్రకటించలేకపోయారు. పొరుగున వున్న ఒరిస్సా లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి గా చేసిన నవీన్ పట్నాయక్ ఓటమిని హుందాగా అంగీకరించి బీజేపీ ప్రభుత్వం తో చెట్టా పట్టా లేసుకొని తిరుగుతున్నారు. 

Share