Current Date: 02 Apr, 2025

కప్ కొట్టిన టీమిండియాకి కళ్లుచెదిరే ప్రైజ్ మనీ

ఛాంపియన్స్ ట్రోఫీని 12 ఏళ్ల తర్వాత మళ్లీ గెలిచిన భారత్ జట్టుకి కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ దక్కింది. న్యూజిలాండ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియాకు రూ.19.45 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది. ఆఖరిగా 2013లో భారత్ జట్టు ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలో గెలిచింది. ఫైనల్లో ఓడిన కివీస్‌కు రూ.9.72 కోట్లు ఇవ్వగా.. సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీమ్స్‌కి రూ.4.86 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కనుంది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచి రూ.20.03 కోట్ల ప్రైజ్‌మనీని భారత్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ ఈ ప్రైజ్‌మనీని ఇవ్వగా.. భారత క్రికెటర్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడ కోట్లాది రూపాయల ప్రైజ్‌మనీని ఆటగాళ్ల కోసం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రైజ్‌మనీ మొత్తాన్ని జట్టులోని ఆటగాళ్లు, కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ పంచుకుంటారు.

Share