Current Date: 02 Apr, 2025

భార్యకి విడాకులిచ్చి.. లవర్‌తో స్టేడియంలో దొరికిన భారత్ క్రికెటర్

భారత క్రికెటర్ చాహల్ మళ్లీ పర్సనల్ విషయాలతో వార్తల్లో నిలిచాడు. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు లవర్‌తో స్టేడియానికి వచ్చాడు. ఇటీవల తన భార్య ధనశ్రీ వర్మ‌కు చాహల్‌కు విడాకులిచ్చిన విషయం తెలిసిందే. స్టేడియంలోని వీఐపీ స్టాండ్‌లో చాహల్ ఓ అమ్మాయితో కలిసి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నప్పుడు కెమెరా అటు వైపు వెళ్లింది. దాంతో ఆ మిస్టరీ గర్ల్ ఎవరు? అనే ఎంక్వైరీని నెటిజన్లు మొదలెట్టారు. చాహల్ కొత్త ప్రియురాలు ఈమె అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, భార్యకు విడాకులిచ్చి, కొత్త ప్రియురాలను సెట్ చేసుకున్నాడని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్‌గా ఆ అమ్మాయి ఆర్జే మహ్వాష్ అని నెటిజన్లు కనిపెట్టేశారు. అంతేకాదు ఈ అమ్మాయి కారణంగానే ధనశ్రీ వర్మ చాహల్‌కు విడాకులిచ్చి ఉంటుదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో చాహల్ ఆడకపోయినా.. చర్చ మాత్రం ఇప్పుడు చాహల్ గురించే ఇప్పుడు జోరుగా నడుస్తోంది.

Share