జిల్లా ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంను యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయ కిృష్ణణ్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ను ప్రజలకు మరింత సమర్థవంతంగా అమలు చేసే నిమిత్తం జిల్లాలోని కలెక్టరు కార్యాలయంతో పాటు, డివిజను, మండల, మున్సిపల్ కార్యాలయాలలో మరియు గ్రామసచివాలయాలలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించుటకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కావున సోమవారం ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు తమ సమీప రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, మండల తహశీల్దార్ మరియు మునిసిపాలిటీ కార్యాలయంలతో పాటు గ్రామ సచివాలయాలలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకొనవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Share