Current Date: 02 Apr, 2025

భూగర్భ మార్గం ద్వారా శ్రీశైలానికి.. కేంద్రం కీలక నిర్ణయం.. అధ్యయనంకోసం రంగంలోకి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రధాన మార్గాల్లో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి ఒకటి. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతాలకు వెళ్లేవారు చాలామంది ఈ రహదారి ద్వారానే ప్రయాణిస్తుంటారు. అయితే, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తద్వారా వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం రెడీ అయింది. అయితే, ఈ మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఉండటంతో 30 అడుగుల ఎత్తులో 62.5 కిలో మీటర్లు మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా చేశారు. తాజాగా.. ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా రహదారి నిర్మించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Share