Current Date: 06 Jul, 2024

పవన్‌కల్యాణ్‌కు మద్దతు తెలిపిన బన్నీ

 జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు రోజురోజుకూ ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇటీవల సీనియర్‌ హీరో నరేష్‌, కుర్ర హీరోలు నాని, రాజ్‌తరుణ్‌ లాంటి వారు ట్విట్టర్‌ ద్వారా జనసేనకు సపోర్ట్‌గా ఉన్నట్లు ప్రకటించారు.
తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సైతం పవన్‌ వెంట నిలబడ్డాడు. బన్నీ ప్రచారానికి రాకపోయినా.. తాను ఎల్లప్పుడూ పవన్‌ కల్యాణ్‌కే సపోర్ట్‌ ఉంటానని తెలుపుతూ పోస్ట్‌ చేశాడు. ‘‘మీ ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను పవన్‌ కల్యాణ్‌ గారు. మీ జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను. కుటుంబ సభ్యునిగా, నా ప్రేమ, మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఆశించినదంతా సాధించినందుకు నా శుభాకాంక్షలు’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.