Current Date: 25 Nov, 2024

A rare honor for a Telugu woman in America

బాడిగ జయ కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2022 నుండి ఆమె ఇదే కోర్టులో కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కాలిఫోర్నియాలో జడ్జిగా అపాయింటైన వారిలో జయ మొదటి వ్యక్తి. విజయవాడ జయ స్వస్థలం. ఆమె స్కూలింగ్ ఇక్కడే సాగింది. 1991 నుండి 1994 లో హైద్రాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం అమెరికాకు వెళ్లారు. అక్కడ బోస్టన్ విశ్వవిద్యాలయంలో MA, శాంటాక్లారా యూనివర్శిటీలో లా పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ పరీక్షను జయ పూర్తి చేశారు. పదేళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2022 నుండి శాక్రమెంటో సుపీరియర్ కోర్టు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు.జయ తల్లిదండ్రులు బాడిగ రామకృష్ణ, ప్రేమలత. రామకృష్ణ 2004 నుండి 2009 వరకు మచిలీపట్టణం ఎంపీగా పని చేశారు. రామకృష్ణ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. జయ మూడో కూతురు.