Current Date: 27 Nov, 2024

భారత్ పేరుతో చైనా సరుకు మెడ్ టెక్ జోన్ లో కుమ్ముడే కుమ్ముడు

భారత దేశంలో 99 లక్షల రూపాయలకు ఎంఆర్ఐ అందుబాటులోకి వస్తోందని నితిన్ గడ్కరీ పార్లమెంటులో  సగర్వంగా  పలిపారు.  కరోనా వ్యాక్సిన్  ను అందుబాటు లోకి తేవడంలో ప్రపంచానికే భారతదేశం ఆదర్శం అయిన తరుణంలో,  ఆదేకోవలో మోదీ బృందంలోని వ్యక్తి గడ్కరీ మాటలు నమ్మశక్యంగా నిలిచాయి.ఇది పార్లమెంటు సభ్యులకే కాదు యావత్ భారత దేశానికీ సంతోషం కలించే సమాచారం అయింది. ప్రతిష్టాత్మక మైన ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ వేదిక గా  విశాఖలో జాన్ సెన్ ఇండియా మెడ్ టెక్ ప్రవేట్ లిమిటెడ్ పేరుతో  రూపుదిద్దుకొంది.ఇప్పటి వరకూ కార్పొరేట్ కే పరిమిత మైన ఖరీదైన వైద్యం ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా సాకారం కానుందన్న ఆలోచన ఎంతో  ధైర్యాన్ని ఇచ్చింది.అయితే  ఈ అంశం అమలులోకి వచ్చేసరికి గడ్కరీ ప్రకటన తో ఏ మాత్రం సంబంధం లేకుండా చైనా కంపెనీలతో ఇక్కడి వ్యక్తులు భాగస్వామ్యమై కోట్లరూపాయల ప్రభుత్వ ధనాన్ని వ్యయం చేసేశారు . ఇంత వరకూ ఎన్ని ఎంఆర్ ఐలు ఉత్పత్తి చేశారు? ఎంత ఆదాయాన్ని రాబట్టారు? ఎన్ని స్టాటప్ కంపెనీలకు అవకాశం కల్పించారు?.  అన్న వివరాలు ఎక్కడా లేవు. ఉద్యోగ, అనుబంధ ఉపాధి అవకాశాలు వివరాలు కూడా ప్రస్తావనకు రాలేదు.. 

 

 

Share