Current Date: 26 Nov, 2024

తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ దానా ఈ రోజు తెల్లవారు జామున పూరి సమీపంలోని ధమ్రా- హబలి ఖాతి  మధ్య ప్రాంతంలో తీరాన్ని  దాటింది. దీంతో ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు  కురుస్తున్నాయి. గంటకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు తీరం దాటి సమయంలో వీస్తున్నాయి. ఇప్పుడు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది... ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఉత్తరకొస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. 

Share