హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్‌లో పట్టుబట్టాడు. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరి కొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉండటం సంచలనం రేపింది.నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి.. 199 గ్రాములకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నైజీరియన్లు పలువురు వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఫేక్ పాస్పోర్టుతో నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చి వీరు డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఆరు నెలల్లోనే 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్ సరాఫరా చేసినట్లుగా గుర్తించారు.విచారణలో పెడ్లర్‌గా అమన్ ప్రీత్ సింగ్ తేలితే ఆ కేసు కూడా పెడతామన్నారు. ఇప్పటికి అయితే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ వినియోగదారుడైనా నిందితుడేనని పోలీసులు తెలిపారు.
Share