Current Date: 05 Oct, 2024

విశాఖ - కిరండూల్ రైలు దారి మళ్లింపు

భారీ వర్షాల కారణంగా కొత్తవలస- కిరండూల్  మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మల్లించారు.  విశాఖ - కిరండూల్ 18514, కిరండూల్ - విశాఖ 18513 రైలు విజయనగరం, రాయగడ, కోరాపుట్, మీదుగా దంతెవాడ చేరుకొంటుందని తెలిపారు. తిరిగి అదే మార్గంలో విశాఖ వస్తుందని  వాల్తేర్ డివిజినల్ వాణిజ్య మేనేజర్ కె. సందీప్ వెళ్ళడించారు. విశాఖ - కిరండాల్  పాసింజర్ దంతివాడ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తుందని చెప్పారు.

Share