ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరోటి వెంట వెంటనే అమలు చేస్తోంది.అయితే రాష్ట్రంలో మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పథకం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం. అయితే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మహిళలకు మాత్రమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని భావిస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య సేవలను పొందేందుకు ఉచితంగా బస్ పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అకాశం ఉందంటున్నారు
Share