Current Date: 27 Nov, 2024

ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన ఎప్పటి నుంచంటే?

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాబోయే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీగా వానలు పడే ఛాన్స్ ఉంది. రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది అంటున్నారు. శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.మరోవైపు తెలంగాణలో ఇవాళ భారీగా, గురువారం నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Share