Current Date: 04 Jul, 2024

అనకాపల్లిలోనూ జగన్ ప్యాలెస్

అధికారం చేతిలో ఉంది కదా అని వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. పూర్తిస్థాయి అనుమతులేవీ లేకుండానే రాష్ట్రంలోని పలు చోట్ల పార్టీ కార్యాలయాల్ని నిర్మించేసింది. జీవీఎంసీ అనుమతులు కాకుండా తాను ఇంచార్జి కమిషనర్ గా ఉన్న వీఎంఆర్డీఏ ద్వారా అనుమతులిప్పించేసి విశాఖ కలెక్టర్ మల్లికార్జున ఘనతికెక్కారు. దీంతో శనివారం విశాఖ ఎండాడలోని వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు షో కాజ్ నోటీసులిచ్చారు. అయితే అనకాపల్లి జిల్లా కేంద్రంలోనూ నిబంధనలు ఉల్లంఘించి పార్టీ కార్యాలయాన్ని నిర్మించేశారు. దీంతో అక్కడా నోటీసులిచ్చారు. పార్టీ కార్యాలయం కోసం జీవీఎంసీ అనుమతుల్లేకుండా భారీ భవనాన్ని నిర్మించేసింది. జాతీయ రహదారి సమీపంలోని 1.75ఎకరాల స్థలంలో 33ఏళ్లకు లీజుకు తీసుకున్నట్టు పత్రాలు సిద్ధం చేశారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం ఏడాదికి ఎకరానికి రూ.1000చెల్లించేలా స్థలo ఇప్పించేసుకున్న వైనం బయట పడింది. కూటమి ప్రభుత్వం ఈ అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి నోటీసులిప్పిస్తోంది.

Share