అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. గడువులోగా ఒకే ఒక నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ విజయం సాధించారు. పలుశాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు. స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు: ఏపీ శాసనసభ స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నేతలు కార్యదర్శికి సమర్పించారు.
Share