Current Date: 05 Oct, 2024

ఇదెక్కడి దిక్కుమాలిన సాంప్రదాయం.. శవాలతో పండగ ఏంట్రా బాబు....

ప్రపంచంలో వివిధ ఆచారాలు, అనేక సంప్రదాయాలు ఉంటాయి. అయితే ఒక ఆచారం గురించి చెబితే ఇదెక్కడి దిక్కుమాలిన ఆచారం అని ఖచ్చితంగా అంటారు. అదే శవాలతో పండుగ. అదేంటి శవాలతో పండుగ ఏంట్రా బాబు అంటారా. అవును మీరు విన్నది నిజమే.. వారు అక్కడే పాతిపెట్టిన శవాలను బయటకు తీసి, దానిని అందంగా అలంకరించి, వాళ్లు బతుకున్నప్పుడు ఏమేమి చేసేవారో.... ఇష్టంగా ఏం తినేవారో.. ఎలా తయారు అయ్యేవారో.. అచ్చం అలాగే వంటలు చేసి, అందంగా ముస్తాబు చేసి ఆ శవాన్ని పూజించి చేస్తారు. ఇలాంటి ఆచారం చూడాలంటే డైరెక్ట్ గా ఇండోనేసియా వెళితే మీరు స్వయంగా చూడొచ్చు. ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు చనిపోయిన వారిని.. సమాధి నుంచి బయటకు తీసి, స్నానం చేయించి, పండుగలా జరుపుకునే సంప్రదాయాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అయితే ఆ వేడుక ఇంకా ఇప్పటికి కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఈ వేడుకను మనెనే పండుగ అంటారు. దక్షిణ ఇండోనేషియాలోని సులవేసిలోని తోరాజా సంఘం ఒక విచిత్రమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అంటే చనిపోయిన వారు ఇంకా బతికే ఉన్నారనే నమ్మకం. అందుకే వారి సంవత్సరికం పాతిపెట్టిన శవాలను బయటకు తీసి ఆ రోజున పండుగ చేసుకుంటారు. ఈ ప్రత్యేక వేడుకను మనెనే అంటారు. ఆ రోజు అంటే సమాధుల నుండి శవాలను బయటకు తీసి శుభ్రం చేసే పండుగ. ఈ వేడుకలకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. శవాన్ని గుంతలోంచి బయటకు తీసి స్నానం చేయిస్తారు. ఆ శవానికి అంటుకున్న కీటకాలు, మురికిని జాగ్రత్తగా శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు ధరించి, సమాధులను శుభ్రం చేస్తారు. మృతదేహాలను శుభ్రం చేసిన తర్వాత వారి పట్ల తమకున్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తారు. వాటిని అందంగా అలంకరింస్తారు. పురాతన ఆచారాలను అనుసరించడంతో పాటు టోరోజా ప్రజలు సంబంధాల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి వేల సంఖ్యలో ఆ పండుగకు కలిసి వస్తారు. టోరోజా ప్రజలు కొనసాగిస్తున్న ఈ ఆచారం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది.