Current Date: 30 Jun, 2024

ప్రజా దర్బార్‌కు వినతుల వెల్లువ...

కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం “ప్రజాదర్బార్” కు తరలివచ్చి భరోసా ఇచ్చానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో బుధవారం నిర్వహించిన “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నన్ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు ప్రజలు బారులు తీరారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చాను. ప్రతి ఒక్కరి వద్ద నుంచి వినతిపత్రాలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాను. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల గౌరవ వేతనాలు పెంచాలని మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నన్ను కలిసి విజ్ఞప్తి చేశారు.