వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. జేసీబీల ద్వారా సిబ్బంది వాటిని తొలగించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను అనుమతించడం లేదు. ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేశారు. వర్షాల కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల గిరుల్లో వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తోంది.