విద్యార్థినుల ఎదుటే దుస్తులు లేకుండా ఈతకొట్టిన ప్రిన్సిపాల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూలు ప్రిన్సిపల్ లాల్‌చంద్ మీనా.. ఇటీవల పాఠశాల సమీపంలోని జలాశయం వద్దకు విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆ సమయంలో ప్రిన్సిపల్ విద్యార్థినుల ఎదుటే దుస్తులు లేకుండా ఈతకు దిగి వారితో కలిసి సరదాగా జలకాలాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ కావడంతో విద్యాశాఖ వెంటనే స్పందించింది. ప్రిన్సిపల్ ప్రవర్తన ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించేలా ఉందని నిర్ధారించి.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థినుల భద్రత, స్కూలు నిర్వహణలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఆయన తీరుపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.