దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం టాయిలెట్‌లో బెదిరింపు లేఖ కన్పించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో అత్యవసరంగా దించేశారు. ఆదివారం ఉదయం 7.55 గంటలకు ఇండిగో విమానం జబల్‌పుర్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. దాదాపు 9 గంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లోకి వెళ్లగా కమోడ్ సీటుపై ఓ పేపర్ కన్పించింది. దానిపై ‘బ్లాస్ట్’ అని రాసి ఉండటంతో వెంటనే సిబ్బందికి చెప్పారు. అప్రమత్తమైన పైలట్, విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారమిచ్చారు. అనంతరం విమానాన్ని నాగ్‌పుర్‌కు మళ్లించారు. ఉదయం 9.20 గంటలకు విమానం నాగ్‌పుర్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి.