అమెరికాలో శతాబ్ధకాలంగా ఓ పురాతన సంప్రదాయం కొనసాగుతోంది. ఒక వ్యక్తికి రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవిని మాత్రమే చేపట్టే అవకాశం ఉండగా.. అమెరికా చరిత్రలో ఒకే ఒక అధ్యక్షుడు మూడు పర్యాయాలు పదవిని చేపట్టాడు, అది కూడా అప్పటి కారణాల వల్ల మాత్రమే. అయితే ఎవరు పోటీ చేసినా రెండు పర్యాయాలు వరసగా పోటీ చేసేయడం, ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి దాదాపుగా దూరం కావడం జరుగుతూ ఉంటుంది. బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, ఒబామా ఇలా చాలా మంది ఇలా నిష్క్రమించిన వారే. జిమ్మీ కార్టర్, జార్జ్ బుష్ ఒక్కో పర్యాయం తర్వాత వైట్ హౌస్ కు దూరం అయ్యారు. కానీ.. ట్రంప్ మాత్రం గోడకు కొట్టిన బంతిలా తిరిగి పవర్‌లోకి వచ్చాడు. అమెరికాలో సాధారణంగా ఒకసారి బాధ్యతలు నిర్వర్తించాకా ఓడిపోతే మళ్లీ అధ్యక్షుడు కావాలనే ప్రయత్నాలను చేసిన వారు కనపడరు. కానీ.. ట్రంప్ చాలా డిఫరెంట్. తన నాలుగేళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా, ఆ తర్వాతి నాలుగేళ్లకు మళ్లీ పార్టీ తరఫున అవకాశం సంపాదించడంతో పాటు, ఎన్నికల్లో కూడా నెగ్గి పదవిని చేపడుతున్నాడు.
Share