Current Date: 05 Oct, 2024

వైసీపీకి సపోర్ట్ చేసిన యాంకర్ శ్యామలకి బెదిరింపులు

ఏపీలో వైసీపీకి ప్రచారంచేసిన యాంకర్ శ్యామలన టీడీపీ, జనసేనకార్యకర్తలుటార్గెట్ చేస్తున్నారు.కూటమివిజయం తర్వాత తనకుబెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయన్న శ్యామలదయచేసి ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దంటూరిక్వెస్ట్ చేసింది.బెదిరిస్తూచాలా కాల్స్ వస్తున్నాయి. ఒక రకంగా భయమేస్తోంది. మీకు ఒకటి నచ్చుతుంది.. నాకు ఒకటి నచ్చుతుంది. అలా అని మీకు నచ్చంది నాకు నచ్చిందని నేను బతకడానికి వీల్లేదంటే చాలా అన్యాయం. దయచేసి ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదు. ఎవరిపై వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదు. నాకు చాలా గౌరవం. మీరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు ఒక పార్టీని గెలిపించేందుకు ఎంత చేయాలో అంత చేశాఅప్పుడు కూడా ఉన్నదే చెప్పాను. లేనిది ఎక్కడా మాట్లాడలేదు.