భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఆయన కుమారుడు వెంకట సీతారంను ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. పొడిచేటి భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సంతానంగా కుమార్తెలు మాత్రమే ఉండడంత వెంకట సీతారాంను కొన్నేళ్ల కిందట దత్తత తీసుకున్నాడు. అనంతరం భద్రాచలం ఆలయ అర్చకుడిగా ఉద్యోగం ఇప్పించాడు.వెంకట సీతారాంకు ఏపీలోని తాడేపల్లిగూడెంకు చెందిన యువతితో 2019లో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన కొన్ని నెలలకే సీతారాం వరకట్నం తేవాలని భార్యను వేధింపులకు గురి చేయటం మెుదలుపెట్టాడు. ఆ తర్వాత మామ సీతారామానుజాచార్యులు ఆమెపై కన్నేశాడు. తనకు కుమారులు లేరని తన పోలికలతో ఒక బాబు కావాలని కోడలిపై సీతారామానుజాచార్యులు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పగా వినిపించుకోలేదు. సీతారామానుజాచార్యులు అలాంటి వాడు కాదని రివర్స్‌లో భార్యతోనే తండ్రికి క్షమాపణ చెప్పించాడు. దీంతో బాధితురాలు ఈ ఏడాది ఆగస్టులో తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది.
Share