Current Date: 21 Sep, 2024

జానీ మాస్టర్‌కి నాగబాబు మద్దతు ఏకిపారేస్తున్న నెటిజన్లు

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఆయన చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇప్పటికే జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అత్యాచారం కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది.తెలుగు ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తోటి కొరియోగ్రాఫర్స్‌ను వేధింపులకు గురి చేశారు. కార్యవర్గం నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారు. అసోసియేషన్ ఆడిషన్స్‌లో సెలక్ట్ అయిన వారికి సభ్యత్వం ఇ‍వ్వకుండా వేధించారు. దాదాపు 90 మంది కొరియోగ్రాఫర్స్‌ను సభ్యత్వం ఇవ్వకుండా జానీ మాస్టర్‌ వేధింపులకు గురిచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో అతనికి పలుకుబడి ఉండడంతో అరాచకాలపై మాట్లాడేందుకు కొరియోగ్రాఫర్స్‌ జంకుతున్నారు.జానీ మాస్టర్‌కి మద్దతుగా నాగబాబు నిలిచాడు. 

Share