తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తెలిపారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందని ట్వీట్ చేశారు.