క్యాట్ తీర్పును సవాలు చేస్తూ ఐఏఎస్ అధికారులు బుధవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని తెలంగాణ రాష్టంలో తమను కొనసాగించే విధంగా చూడాలని కోరిన వారు హైకోర్టును అభ్యర్ధించారు. ఐఏఎస్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు పిటిషన్‌ను జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ విచారించునుంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలనీ ఈ నెల 9న డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలను ఐఏఎస్ లు క్యాట్‌లో సవాల్ చేశారు. క్యాట్ సైతం డీవోపీటీ సర్కులర్ ను సమర్ధించింది. దీంతో క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రోస్, సృజన, శివశంకర్, హరికిరణ్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Share