సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సెక్యూలరిజం అంటే వన్ వే మాత్రమే కాదని ఇది టూవే అంటూ తీవ్ర స్థాయంలో పవన్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్‌కు మద్దతు ఇవ్వడంతో పాటు ఆయనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే హిందువులమైన మనందరం న్యాయబద్ధంగా గళం విప్పుతామన్నారు. తమ జోలికి వస్తే మౌనంగా ఉండబోమని చెప్పారు. సెక్యూలరిజం అనేది టూ వే మార్గం అంటూ ఓ శ్లోకాన్ని సోషల్ మీడియాలో బండిసంజయ్ పోస్ట్ చేశారు.