విశాఖపట్నంలో రుషికొండ విధ్వంసం, కొండపై ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ప్యాలెస్ నిర్మాణ అనుమతుల ఫైళ్లు, కొన్ని ముఖ్యమైన పేపర్లు ఇప్పటికే కనిపించడంలేదు. ఇప్పుడు కొండపై గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టేందుకు తీసుకున్న అనుమతుల ఫైళ్లు కూడా గల్లంతయ్యాయి. ఆ రిసార్టులో 80 గదులతో పాటు ఒక పంక్షన్ హాలు, బార్ అండ్ రెస్టారెంట్ ఉండేవి. వాటిల్లో ఉండాల్సిన దాదాపు రూ.50 కోట్ల విలువైన ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇతర సామగ్రి ఏమైందో తెలియక ఏపీ టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్యాలెస్ నిర్మాణంలో భాగంగా రిసార్టును కూలగొట్టిన సమయంలో అప్పటి అధికారులు ఈ సామగ్రిని ఏంచేశారో వివరించే ఫైల్ ఏదీ అందుబాటులో లేదు. ఈ ఫర్నిచర్ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక ఫైల్ ఏపీటీడీసీ వద్ద ఉండేది. ప్రభుత్వం మారిన తర్వాత అది మాయమైనట్లు తెలుస్తోంది.