Current Date: 04 Jul, 2024

విశాఖలో క్షుద్ర పూజల కలకలం

విశాఖలోని కాకాని నగర్ సమీప విమాన నగర్ లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బోరా రాజేష్ అనే డ్రైవర్ రాత్రి వేళ 10రోజులుగా, శరీరంపై ఎలాంటి దుస్తులు లేకుండా, పెద్ద పెద్ద అరుపులతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాను అప్పులపాలయ్యానని, అమ్మవారికి పూజలు చేస్తున్నానని రాజేష్ చెబుతున్నాడు. ప్రశాంతత కోసమే రాత్రివేళ చేస్తున్నానని, అవి క్షుద్ర పూజలు కావని చెప్పినప్పటికీ స్థానికులు పోలీసుల్ని ఆశ్రయించారు.

Share