Current Date: 26 Nov, 2024

వైసీపీ ట్విట్టర్ అకౌంట్‌కి బ్లూ టిక్ మాయం.. ట్రోల్స్ షురూ!

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్‌కి ఉన్న బ్లూ టిక్ సడన్‌గా మాయమైంది. ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకున్న దశలో.. వాడీవేడిగా టీడీపీ, వైసీపీ విమర్శ బాణాలు సంధించుకుంటున్నాయి. ఈ దశలో ఫేక్ పోస్టులు కూడా, తప్పుడు ప్రచారం కూడా తారా స్థాయికి చేరింది.ఫేక్ పోస్టులు పెట్టడంతోనే వైసీపీకి బ్లూ టిక్ పోయిందంటూ టీడీపీ ట్రోల్స్ స్టార్ట్ చేసింది. సోషల్ మీడియాలోనూ ఈ మేరకు జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు బ్లూ టిక్ పోయింది.. జూన్ 4 తర్వాత పార్టీనే కనబడదంటూ టీడీపీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.ట్విటర్‌లో బ్లూటిక్‌ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని.. అలా కట్టనివారికి బ్లూటిక్‌ తొలగిస్తామని ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. గత ఏడాది ఏప్రిల్‌లో మన దేశంలోని పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల ఖాతాల బ్లూటిక్‌లు మాయం కూడా చేశాడు. గత ఏడాది ఏపీ సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌, రాహుల్‌గాంధీ, ప్రియాంక తదితరుల ట్విటర్‌ ఖాతాల్లో బ్లూటిక్‌లు కనిపించలేదు. ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతాను ప్రభుత్వ ఖాతాగా గుర్తిస్తున్నట్టు గ్రే టిక్‌ మాత్రం ఇచ్చాడు.