Current Date: 30 Jun, 2024

రైతులకు సాగునీరు అందించాలి...

ఎమ్మెల్యే గొండు శంకర్, సాగునీటి కాలువల మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు అయన తెలిపారు. స్థానిక వంశధార ప్రాజెక్ట్ సర్కిల్ కార్యాలయంలో సాగునీటి సరఫరా పై ఇంజనీరింగ్ అధికారులతో బుధవారం అయన సమీక్ష నిర్వహించారు. ఇటీవల వంశధార కుడి ప్రధాన కాలువ పరిశీలనలో గుర్తించిన సమస్యలపై అరా తీశారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను ఇస్తుందని, రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో చిట్ట చివరి భూములకు సైతం సాగునీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని, గుర్రపుడెక్క, పూడిక తీత పనులు చేపట్టాలని, మరమ్మత్తు పనులు అవసరమైతే యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వంశధార ఎస్ ఈ బి. రాంబాబు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Share