ప్రజలకు సేవ చేయాలంటే అధికారంతోపాటు మనసు కూడా ఉండాలని నిరూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడటం కోసం ప్రభుత్వాన్నే కదిలించిన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. వైద్యబృందం చిన్నారి ఇంటికే వెళ్లి బాలుడి ప్రాణాలను కాపాడారు. ఇప్పటివరకు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి అరుదైన సంఘటన విజయవాడలో నిజమైంది. విజయవాడలోని పాతరాజేశ్వరిపేటకు చెందిన లోకేష్ అనే వ్యక్తికి దేవాన్ష్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు గత కొన్ని రోజులపాటు టైపాయిడ్ బారిన పడ్డాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. జ్వరం తీవ్రత ఎక్కకావడంతో 14 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 4 శాతానికి పడిపోయింది. దీంతో దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా మారింది.