Current Date: 25 Nov, 2024

రెండో వీడియో వదిలిన నటి హేమ.. ఉతికారేస్తున్న నెటిజన్లు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దొరికిపోయిన నటి హేమ.. ఆ అపవాదు నుంచి తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే ఒక వీడియో ఆమె వదిలినా.. అది రివర్స్‌లో ఆమెకే తగిలింది. దాంతో ఇప్పుడు తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ కవర్ చేసేలా బిర్యానీ వండుతున్న వీడియో వదిలింది. కానీ.. ఇది కూడా రివర్స్ అయ్యింది.

రేవ్ పార్టీలో ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు పాల్గొన్నారంటూ కన్నడ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలువురు పేర్లు కూడా బయటికొచ్చాయి. అందులో నటి హేమ పేరు కూడా ఉంది. కానీ తనకి రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, తాను రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ హేమ నిన్న ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. ఆ పార్టీలో నటి హేమ ఉన్నారని, ఈ వీడియో కూడా బెంగళూరు ఫామ్‌హౌస్‌లో షూట్ చేసిందేనని కర్ణాటక పోలీసులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

తాజాగా తాను చికెన్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తూ హేమ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హేమను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో ఉండి హైదరాబాద్‌లో ఉన్నట్లుగా వీడియో రిలీజ్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు.